calender_icon.png 25 September, 2024 | 3:19 PM

అమీన్‌పూర్ పెద్దచెరువును సర్వే చేసిన హైడ్రా అధికారులు

25-09-2024 12:38:14 PM

హైదరాబాద్, (విజయక్రాంతి): నగరంలోని చెరువులు, కుంటలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా గుర్తించి కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బుధవారం గోల్డెన్ కీ, వెంకటరమణ కాలనీ, వాణీనగర్, హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ పరిసరాలల్లో రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా సర్వే నిర్వహిస్తుంది. నవ్య చౌరస్తాలో అక్రమంగా కట్టిన భవనాలన్ని రెవెన్యూ సిబ్బంది కూల్చివేసింది. గతంలో ఇక్కడే నిర్మాణాలు కూల్చి మాజీ ఎమ్మెల్యేపై హైడ్రా కేసు నమోదు చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని పెద్దచెరువు కబ్జా చేసి ఎఫ్టీఎల్ పరిధిలో ఇళ్లు కట్టారని హైడ్రా అధికారులకు ఫిర్యాదులు రావడంతో అక్కడ సర్వే నిర్వహించారు.