14-02-2025 12:12:06 AM
పటాన్‌చెరు, ఫిబ్రవరి 13 : నిబందనలకు విరుద్దంగా అనుమతులు లేకుండా కొల్లూ రు రింగురోడ్డు ఎగ్జిట్ పాయింట్ వద్ద ఏర్పా టు చేసిన మై హోమ్ హోర్డింగ్ను హైడ్రా అధికారులు గురువారం కూల్చి వేశారు. హోర్డింగ్ ఏర్పాటుపై వచ్చిన ఫిర్యా దుల మేరకు ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ వద్ద అనుమ తులు లేని హోర్డింగ్ను తొలగించినట్లు హైడ్రా అధి కారి సతీశ్ తెలిపారు. నిబందనలు ఎవరు ఉల్లంఘించిన తగిన చర్యలు ఉంటాయ న్నారు. అనుమతులు లేకుండా ఎలాంటివి ఏర్పాటు చేయోద్దని ఆయన సూచించారు.