calender_icon.png 4 April, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూల్చివేసిన ఇండ్ల శిథిలాలను తొలగిస్తున్న హైడ్రా అధికారులు

16-12-2024 10:28:06 PM

పటాన్ చెరు: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడ గ్రామంలో హైడ్రా అధికారులు ఇటీవల కూల్చివేసిన ఇండ్ల శిథిలాల తొలగింపును సోమవారం చేపట్టారు. ఉదయమే హైడ్రా అధికారులు పటేల్ గూడకు ఇటాచీలతో బుల్డోజర్ లతో రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. మళ్లీ కూల్చివేతలు జరుగుతాయంటూ పుకార్లు మొదలయ్యాయి. కాగా గతంలో కూల్చివేసిన ఇళ్ల శిథిలాలను హైడ్రాధికారులు తొలగింపు చేపట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటివరకు కృష్ణారెడ్డి పెట్, పటేల్ గూడా పరిధిలో హైడ్రా 24 ఇండ్లను కూల్చివేసింది.