calender_icon.png 23 January, 2025 | 3:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మురళీమోహన్‌కు షాక్.. జయభేరికి హైడ్రా నోటీసులు

08-09-2024 11:19:49 AM

హైదరాబాద్: చెరువుల ఆక్రమణలను తొలగించి చెరువుల పరిరక్షణకు హైడ్రా తన దూకుడును కొనసాగిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌తోపాటు పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా.. సినీనటుడు మురళీ మోహన్ చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ జయభేరికి నోటీసులు జారీ చేసింది. గచ్చిబౌలి పరిధిలోని రంగలాల్‌ కుంట చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణ సంస్థకు హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భగీరథమ్మ చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువులోని ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణ వ్యర్థాలను డంపింగ్ చేయడంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామని, వచ్చే 15న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసులు, లేనిపక్షంలో తామే కూల్చివేస్తామని హైడ్రా నోటీసులో పేర్కొంది.