calender_icon.png 19 January, 2025 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా బాధితులను ఆదుకోవాలి

11-09-2024 03:04:00 AM

విద్యార్థుల రాజకీయ పార్టీ అధ్యక్షుడు సునీల్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 10 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో పట్టాలు కలిగిన నిరుపేదల ఇళ్లను కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం సరికాదని.. బాధితులకు తక్షణమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని విద్యార్థుల రాజకీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు యెచ్చు సునీల్ డిమాండ్ చేశారు. ఇటీవల హైడ్రా ద్వారా తమ ఇళ్లను కోల్పోయిన సున్నం చెరువు, అమీన్‌పూర్ బాధితులతో కలిసి మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సునీల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆక్రమణల పేరుతో హైడ్రా చేపడుతున్న కూల్చివేతలతో అనేక మంది నిరుపేదల బతుకులు రోడ్డుపాలు అవుతున్నా యన్నారు.

రియల్ ఎస్టేట్ కంపెనీలపై చర్యలు తీసుకోవడం వదిలేసి నిరుపేదలపై జులుం ప్రదర్శించడం సిగ్గు చేటన్నారు. హైడ్రా బాధితులను ప్రభుత్వం ఆదుకోకుంటే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రు లు నివాసాలను ముట్టడిస్తామన్నారు. ప్రెస్‌మీట్ అనంతరం పోలీసు లు వారిని అరెస్టు చేసి బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో విద్యార్థు ల రాజకీయ పార్టీ నాయకులు.. ఇజ్జగిరి కమలాకర్, పాక నవీన్‌బాబు, సాత్విక రెడ్డి, సాయి మహేష్, అనిల్, వినయ్, అనికేత్, నందు, శ్రీనివాస్, హైడ్రా బాధితులు పాల్గొన్నారు.