calender_icon.png 27 December, 2024 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీర్జాదిగూడ, బోడుప్పల్ జంట కార్పొరేషన్లపై హైడ్రా నజర్

02-12-2024 11:14:50 PM

అక్రమార్కుల గుండెల్లో మొదలైన ఫియర్...

మేడిపల్లి (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంతో పాటు నగర పరిసర మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల నుండి చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు ఆక్రమణలపై హైడ్రాకు అనేక ఫిర్యాదు అందుతున్నాయి. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం జంట కార్పొరేషన్ లలో పలు అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా టీమ్ ఎంటర్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా జంట కార్పొరేషన్ లలో అలజడి రేగింది.  పీర్జాదిగూడ మున్సిపాలిటీలో సర్వే నంబర్ 1, 10, 11లో దాదాపు 3 ఎకరాల గ్రేవ్ యార్డ్ కబ్జాకు గురి అయ్యిందని ఛార్లెస్, మజార్ లు హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ఇప్పటికే పీర్జాదిగూడలోని చెరువుల ఎఫ్.టి.ఎల్, బఫర్ జోన్ లలో పలు అక్రమ నిర్మాణలకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్ల చింతలచెరువు బఫర్ జోన్ లో నిర్మించిన భారీ అక్రమ నిర్మాణాలపై కొత్త కిషోర్ గౌడ్, కొత్త ప్రభాకర్ గౌడ్, కుర్రి శివశంకర్ లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేయడంతో సోమవారం హైడ్రా టీమ్ స్థానిక సంబంధిత అధికారులతో పర్యటించి వివరాలు సేకరించారు. పర్యటించిన వారిలో హైడ్రా టీమ్ అడిషనల్ కలెక్టర్ సుధా, తహసీల్దార్ హేమ, ఏ.ఈ విజయ్ కుమార్ లతో పాటు మేడిపల్లి తహసీల్దార్ హసీనా, పీర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్ రఘు, ఇరిగేషన్ ఏ.ఈ పరమేష్, ఆర్.ఐ లు రాకేష్, సత్యనారాయణలు పాల్గొన్నారు.