calender_icon.png 30 April, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా లోగో మార్పు

24-04-2025 01:57:28 AM

‘హెచ్’ అక్షరంపై నీటి బొట్టుతో కొత్త లోగో

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): గ్రేటర్‌లో చెరువులు, ప్రభు త్వ స్థలాల పరిరక్షణకు కృషి చేస్తోన్న హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) లోగో మారింది. ఇంతకాలం ఈవీడీఎం లోగోతో పని చేసిన హైడ్రా తాజాగా తన పేరున కొత్త లోగోను తయారు చేసింది. హైడ్రాను ఆంగ్లంలో సూచించే మొదటి అక్షరం ‘హెచ్’పై నీటి బొట్టుతో కూడిన లోగోను రూపొందించు కుంది.

హైడ్రా ఎక్స్‌లో కొత్త లోగో మార్పు విషయాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా హైడ్రా సిబ్బంది ‘ఎక్స్’లో హైడ్రా ప్రొఫైల్ పిక్చర్‌ను ఆధునీకరించారు. నగరంలో జల సంరక్షణ చేపడుతూ, నగరాన్ని విపత్తుల నుంచి రక్షించుకుం దామనేలా కొత్త లోగో ఉంది. హైడ్రా కమిష నర్ ఏవీ రంగనాథ్ ఈ లోగోను అధికారి కంగా ఆమోదించారు. హైడ్రా కార్యాలయం, సిబ్బంది యూనిఫాం, వాహనాలపై కొత్త లోగోను ముద్రించాలని సిబ్బందిని ఆదేశించారు.