calender_icon.png 11 January, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా

11-01-2025 01:25:09 AM

నెక్నాంపూర్ పెద్దచెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో వెలిసిన విల్లాల నేలమట్టం

రాజేంద్రనగర్, జనవరి10: మణికొండలోని నెక్నాంపూర్‌లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించారు. పెద్దచెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో వెలిసిన లేక్‌వ్యూ విల్లాస్‌లోని పలు విల్లాలను నేలమట్టం చేశారు. గతలంలో రెవె  మున్సిపల్, హెచ్‌ఎండీఏ అధికారులు ఇక్కడ మూడుసార్లు కూల్చివేతలు చేపట్టినా అక్రమార్కులు మరలా నిర్మాణాలు చేపట్టారు.

ఈనేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు శుక్రవారం భారీ పోలీసు బందోబస్తు నడుమ హిటాచీలతో ఆయా అక్రమ విల్లాలను సిబ్బంది కూల్చివేశారు. మొత్తం 13 విల్లాలను నేలమట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. రెండు విల్లాలకు సంబంధించి కోర్టు ఉత్తర్వులు ఉండటంతో న్యాయస్థానానికి సమాచారం ఇచ్చి కూల్చివేతలు చేపట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు. 

4 నెలల్లో శాశ్వత పరిష్కారం

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6(విజయక్రాంతి): దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ విషయంలో 25 ఏళ్లుగా కొనసా  వివాదాలకు 4 నెలల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మెన్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌పై గతంలో హెచ్‌ఎండీఏ ఇచ్చిన ప్రిలిమనరీ నోటిఫికేషన్‌పై హై కోర్టు ఆదేశాల మేరకు దుర్గం చెరువు పరిసర  నివాసితుల అభ్యంతరాలను రంగనాథ్ శుక్రవారం హైడ్రా కార్యా  స్వీకరించారు. నాలుగు నెలల్లో ఎఫ్‌టీఎల్ సమస్య పరిష్కరిస్తానన్నారు.