calender_icon.png 18 November, 2024 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చందానగర్ లో చెరువులను పరిశీలించిన హైడ్రా

18-11-2024 03:30:19 PM

హైదరాబాద్ (విజయక్రాంతి): శేరిలింగంపల్లి సర్కిల్ చందా నగర్ డివిజన్ పరిధిలోని భక్షికుంట, రేగుల కుంట చెరువులను హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్ సోమవారం సందర్శించారు. ఈ రెండు చెరువులను తక్కువ నిధులతో అభివృద్ధి చేసేందుకు లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్ కు అప్పగించిన నేపథ్యంలో చెరువుల అభివృద్ధిని హైడ్రా అధికారులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువుల్లోకి మురుగు నీరు చేరకుండా మళ్లించిన తీరును ఆనంద్ మల్లిగవాడ్ హైడ్రా కమిషనర్ కు వివరించారు. అపర్ణ హిల్ రాక్ గేటెడ్ కమ్యూనిటీ వాల్లు ఎస్.టి.పి ద్వారా మురుగు నీటిని శుద్ధి చేసి కాలువలలోకి మల్లిస్తున్న తీరును, దీప్తిశ్రీ నగర్ లోని రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను పరిశీలించారు. దాదాపు 5 వేల గజాల స్థలం కబ్జా కాకుండా చూడాలని హైడ్రా స్థానిక  అధికారులకు కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు.