calender_icon.png 23 November, 2024 | 10:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా పేరిట హైడ్రామా

28-09-2024 01:31:38 AM

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి):  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హైడ్రామా నడిపిస్తున్నాడని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా మండిపడ్డారు. చైతన్యపురి ప్రాంతంలోని మారుతీనగర్, ఫణిగిరి, వినాయకనగర్, సత్యానగర్ ప్రాంతాల్లో శుక్రవారం ఆయన హైడ్రా బాధితులను పరామర్శించారు. బాధితులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగడం తో ఎంపీ ఈటల రాజేందర్ సైతం బాధితులకు మద్దతుగా ధర్నాకు దిగారు.

అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ మూసీనది ప్రక్షాళన పేరుతో అనేక సంవత్సరాలుగా నివాసముంటున్న పేదల ఇండ్లను కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న స్థలాలు, భూము లు ప్రభుత్వానివి కావని.. అవి ప్రైవేట్ భూ ములన్నారు. ఇక్కడ లేఔట్‌లు చేసి భూములమ్మితే.. ఆనాడు భూములు కొనుక్కున్న వారు కష్టపడి ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారన్నారు.

ఈ ప్రాంతంలో నిర్మాణాలకు పట్టా లు ఇవ్వడమే కాకుండా అన్ని రకాల అనుమతులు ఇచ్చింది ప్రభుత్వాలే అని స్పష్టం చేశా రు. నగరంలో శనివారం, ఆదివారం వచ్చిందంటే ఏ ఏరియాలో కూల్చివేతలు జరుగుతా యోనంటూ ప్రజలు భయాందోళనలు చెందుతున్నారన్నారు. మూసీకి 60 అడుగుల ఎత్తులో ఇళ్లు ఉన్నాయన్నారు. ఇక్కడెప్పుడూ మూసీ వరదలు రాలేదన్నారు. ప్రభుత్వం ప్రజల పక్షమే ఉంటే ప్రజలతో చర్చలు జరిపి విషయాలు తెలియజేయాలన్నారు.