calender_icon.png 17 October, 2024 | 8:54 AM

గ్రేటర్‌లో హైడ్రాకు విశేష అధికారాలు

17-10-2024 02:53:50 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 16 (విజయక్రాంతి): జీహెచ్ ఎంసీ చట్టంలోని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అధికారాలను హైడ్రాకు బదలాయిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వ్యులు  జారీ చేసింది. ఈ సందర్భం గా రాష్ట్ర పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిషోర్ బుధవారం జీవో నంబరు 191 ను జారీ చేశారు.

హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, రోడ్లు, నాలాలు, పార్కులు తదితర ప్రాంతాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం జూలై 19న జీవో నంబరు 99 ద్వారా సర్కార్ హైదరాబాద్ డిజిస్టార్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైద్రా)ఏర్పాటు చేసింది. చెరువుల కబ్జా చేసి చేపట్టిన పలు నిర్మాణాలను హైడ్రా కూల్చివేతలు చే పడుతున్న నేపథ్యంలోహైడ్రాకు చట్టబద్దత లేదనే అంశంపై విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గవర్నర్ ఈ నెల 5న ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్‌లో జీహెచ్‌ఎంసీ  చట్టంలో 374(బి)అంశాన్ని చేర్చు తూ ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణకు ఏజెన్సీని ఏర్పాటు చేసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించారు.  ఆర్డినెన్స్‌కు అనుగుణంగా జీహెచ్‌ఎంసీ చట్టంలో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, రోడ్లు, పార్కులు, ఇతర పబ్లిక్ ఆస్తుల పరిరక్షణ అధికారాలు వచ్చాయి.

దీంతో ఆక్రమణదారులకు ఇన్నాళ్లూ నోటీసులు ఇవ్వని హైడ్రా, ఇక నుంచి ఆక్రమణలను తొలగించేందుకు నోటీసులు జారీ చేయనున్నది. జీవో కేవలం జీహెచ్‌ఎంసీ పరిధి కి మాత్రమే కాగా, ఓఆర్‌ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల్లోనూ అక్కడి మున్సిపాలిటీ చట్టం ప్రకారం హైడ్రా తన కార్యకలాపాలు కొనసాగిస్తుంది.