calender_icon.png 22 October, 2024 | 8:54 AM

చెరువుల పునరుజ్జీవనంపై హైడ్రా దృష్టి

22-10-2024 03:20:21 AM

  1. ఎర్రకుంట చెరువుతో ప్రారంభించేందుకు ప్రణాళిక
  2. ఆగస్టు 14న చెరువు ఎఫ్టీఎల్‌లో నిర్మాణాలను కూల్చిన హైడ్రా

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 21(విజయక్రాంతి): నగర పరిధిలోని చెరువుల పునరుజ్జీవనంపై హైడ్రా దృషి ్ట సారించింది. నగరంలోని పలు చెరువుల్లోని ఆక్రమణలను తొలగించిన హైడ్రా, చెరువుల ఎఫ్టీఎల్‌లోని నిర్మాణ వ్యర్థాలను తొలగిస్తోంది.

కాగా నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతినగర్‌కు సమీపంలో ఉన్న ఎర్రకుంట చెరువుకు పునరుజ్జీవనం కల్పించేందుకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కాగా ఆగస్టు 14న ఎర్రకుంట చెరువులో నిర్మించిన ఐదు అంతస్తుల మూడు భవనాలను హైడ్రా అధికారులు కూల్చిన సంగతి తెలిసిందే.

అయితే కూల్చివేతల అనంతరం ఆ నిర్మాణదారుడు ఐరన్, సామాగ్రిని మాత్రమే తీసుకెళ్లగా, నిర్మాణ వ్యర్థాలన్నీ అక్కడే ఉండిపోయాయి. దీంతో హైడ్రా అతడికి నోటీసులిచ్చింది. ఎర్రకుంటలో గుట్టలుగా పడి ఉన్న నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు పనులు ప్రారంభించింది.