calender_icon.png 8 January, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రాకు తొలి పోలీస్ స్టేషన్

08-01-2025 12:42:33 AM

మంజూరు చేస్తూ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదేశాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (విజయక్రాంతి): హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా జీవో ఎంఎస్ నంబర్ 3ను మంగళవారం విడుదల చేశారు.

కాగా హైదరాబాద్ మహానగరంలో చెరువుల పరిరక్షణ, నాలాలు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల ఆక్రమణలపై హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఇంత ప్రాధాన్యం గల హైడ్రాకు త్వరలోనే ప్రత్యేక పోలీస్ స్టేషన్ మాసబ్‌ట్యాంక్‌లోని బుద్ధ భవన్‌లోని బి బ్లాక్‌లో ఏర్పాటు కానుంది. ఈ మేరకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీకు హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జీవోలో పేర్కొన్నారు.

తెలంగాణ కోర్ అర్బన్ ఏరియాగా భావించే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ఆక్రమణలకు సంబంధించిన కేసులను ఈ పోలీస్ స్టేషన్‌లో విచారించనున్నారు. అవసరమైన సిబ్బందిని డిప్యూటేషన్‌పై సమకూర్చనున్నారు. ఏసీపీ స్థాయి అధికారి ఎస్‌హెచ్  వ్యవహరించనున్నారు.