calender_icon.png 19 November, 2024 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిమాయత్‌సాగర్‌పై హైడ్రా నజర్

10-09-2024 01:25:17 AM

  1. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలోని నిర్మాణాలను పరిశీలించిన అధికారులు 
  2. చర్యలకు సమాయత్తం 
  3. ఆక్రమణదారుల్లో గుబులు 
  4. ఇప్పటికే ఉస్మాన్‌సాగర్‌లో ఆక్రమణల తొలగింపు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): అత్యవసర సమయంలో నగరవాసుల దాహార్తిని తీర్చే.. వందేళ్లకు పైగా చరిత్ర గల జంట జలాశయాలు ఉస్మా న్‌సాగర్, హిమాయత్‌సాగర్ సంరక్షణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే గండిపేటలోని ఉస్మాన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ని  ఆక్రమణలను కూల్చివేసిన హైడ్రా, ఇప్పుడు హిమాయత్‌సాగర్‌పై దృష్టి పెట్టబోతుందనే ప్రచారం జరుగుతోంది. 

అయితే, ఇప్పటికే జలమండలి, రెవెన్యూ అధికారులు జంట జలాశయాల ఎఫ్‌టీఎల్‌లో క్షేత్రస్థాయిలో పలుమార్లు పర్యటనలు,  సర్వేలు చేశారు. హిమాయత్ సాగర్‌లోని ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లను పరిశీలిస్తూ కట్టడాలు, కాంపౌండ్‌లను గుర్తించారు. దీంతో అక్కడి ఎఫ్‌టీఎల్ పరిధిలో ఇండ్లు, కాంపౌండ్‌లు నిర్మించుకుని ఉన్న పలువురు స్వత హాగా తొలగింపు చర్యలకు పూనుకుంటున్నట్లు తెలుస్తోంది.

దశలవారీగా చర్యలు.. 

జంట జలాశయాల ఎఫ్‌టీఎల్ పరిధిలో ని భవనాలు, కాంపౌడ్‌లను అధికారులు గుర్తించారు. అధికారులు ఉస్మాన్‌సాగర్ పరిధిలో దాదాపు 15 భవనాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం హిమాయత్‌సాగర్ ఎఫ్‌టీఎల్‌పై హైడ్రా దృష్టి సారిస్తోంది. హిమాయత్ సాగర్ పరిధిలోనే దాదాపు 110 పైగా నిర్మాణాలను అధి కారులు గుర్తించినట్లు విశ్వసనీయ సమాచా రం. అయితే, ఇక్కడ ఎఫ్‌టీఎల్ పరిధిలోనే పలువురు ప్రభుత్వ పెద్దల భవనాలు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యం లో కాస్త విరామం ఇచ్చినప్పటికీ.. హైడ్రా తర్వా త టార్గెట్ హిమాయత్‌సాగర్‌పైనే ఉండబోతోందని తెలుస్తోంది.

అయితే, హిమాయత్ సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలోని నిర్మాణాలను తొలగించిన తర్వా త దశల వారీగా జంట జలాశయాల్లోని బఫర్‌జోన్ల పరిధిలోని నిర్మాణాలు, కాంపౌండ్‌లపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పలువురు భవనాలు, కాంపౌండ్‌ల యజమానులు.. నిర్మాణాలను హైడ్రా కూల్చితే పరువు పోతుందని భావించి స్వతహాగా తొలగించుకుంటున్నారని సమాచారం. దానికి తోడు అకస్మాత్తుగా కూల్చితే ఎక్కువ ఆస్తి నష్టం జరుగుతుందని భావించి అన్నీ సర్దుకొని వారే వైదొలుగుతున్న వారూ ఉన్నారు. 

ఎఫ్‌టీఎల్‌లో పోసిన మట్టి తొలగింపేలా?

ఉస్మాన్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కొన్ని భవనాలను తొలగించినప్పటికీ పలు కాంపౌండ్‌లు, మట్టి పోసిన ప్రాంతాలు అలాగే ఉన్నాయి. హిమాయత్ సాగర్ పరిధిలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. అయితే, పలువురు ఆక్రమణదారులు మట్టి పోయడంతో రిజర్వాయర్లలోని నీటి మట్టం తగ్గే అవకాశంతో పాటు నీటికి సరిపడా స్థలం లేక ఎఫ్‌టీఎల్‌లోకి నీరు త్వరగా చేరే అవకాశం ఉంటుంది. అయితే, ప్రస్తుతం భవనాలను తొలగిస్తు న్న అధికారులు ఎఫ్‌టీఎల్‌లో పోసిన మట్టిని తొలగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మట్టిని తొలగిస్తేనే ఎఫ్ టీఎల్‌లో నీరు ఎక్కువగా నిలిచే ఆస్కా రం ఉంటుంది. దీనికి తోడు జంట జలాశయాలకు వచ్చే వరద కాల్వలు కూడా ఆక్రమణకు గురయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. శంషాబాద్, మొయినాబాద్ నుంచి వరద వచ్చే కాల్వలను పలువురు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు ప్రచా రం జరుగుతోంది.