calender_icon.png 25 November, 2024 | 10:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోషల్ మీడియాలో హైడ్రా ఎంట్రీ

27-08-2024 02:34:02 AM

గంటలోనే వెయ్యి మంది ఫాలోవర్స్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (విజయక్రాంతి): అక్రమార్కులను హడలెత్తిస్తున్న హైదరాబాద్ డిజాస్టార్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకూ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజిస్టార్ట్ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం)గా కొనసాగగా, జూలై 19న హైడ్రాగా రూపాంతరం చెందింది. వచ్చీరాగానే హైదరాబాద్ మహానగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై దృష్టిపెట్టి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. హైడ్రా కూల్చివేస్తున్న అక్రమ నిర్మాణాల్లో రాజకీయ, సినీ ప్రముఖులకు చెంది న నివాసాలు కూడా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అయితే, ఇప్పటివరకూ ఎక్స్ వేదికలో ఈవీడీఎంగా ఉన్న అకౌంట్‌ను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం హైడ్రాగా అప్‌డేట్ చేశారు. కానీ, ఇంకా ఈవీడీఎం లోగోనే కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటివరకూ ఈవీడీఎంకు 52 వేలకు పైగా ఫాలోవర్స్ ఉండగా, హైడ్రాగా మారిన తర్వాత గంటల వ్యవధిలోనే 1000 మందికి పైగా ఫాలోవర్స్ పెరగడం విశేషం. ఇప్పటివరకూ హైడ్రాగా ఇంకా ఎలాంటి పోస్టును అధికారులు పోస్టు చేయలేదు.