calender_icon.png 2 November, 2024 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదాపూర్‌లో హైడ్రా డిప్యూటీ కలెక్టర్ పర్యటన

02-11-2024 05:05:49 PM

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం సిపిఎం ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం హైడ్రా డిప్యూటీ కలెక్టర్ విజయ్ కుమార్ మాదాపూర్ ఖానా మెట్ విలేజ్ లోని సర్వే నంబర్ 41/14 లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శోభన్ తో పాటు కృష్ణ కలిసి ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం ఏ విధంగా జరుగుతుందో డిప్యూటీ కలెక్టర్ కు వివరించారు. సర్వే నంబర్ 41/14 ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.దీనికి సానుకూలంగా స్పందించిన హైడ్రా డిప్యూటీ కలెక్టర్ విజయకుమార్ తమ శాఖ నుండి అన్నివిధాల చర్యలు చేపడుతామని తెలిపారు.

అనంతరం సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శోభన్ మాట్లాడుతూ...శేరిలింగంపల్లి మండలం పరిధిలోని మాదాపూర్ ఖానా మెట్ విలేజ్ లోనీ  సర్వే నంబర్ 41/14 లో మొత్తం 250 ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ భూమిని గత ప్రభుత్వం వివిధ సంస్థలకు కేటాయించారని, దాదాపు 70 ఎకరాల భూమి ఇంకా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ అక్రమ పర్మిషన్లు తీసుకొని ప్రభుత్వ భూములే లక్ష్యంగా చేసుకుంటూ కొంతమంది బడా బాబులు ప్రైవేటు సర్వే నెంబర్లు వేసి 41/14లో నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు.ఈ విషయంపై గతంలో రెవెన్యూ దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన తెలిపారు.హైడ్రా పై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం హైడ్రా కు తమ పార్టీ నుండి సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన తెలిపారు.