calender_icon.png 3 February, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు

03-02-2025 06:45:44 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌లో రెండు ఆక్రమ నిర్మాణాలను హైడ్రా (Hyderabad Metropolitan Development Authority) కూల్చివేత డ్రైవ్‌లను నిర్వహించింది. సదరన్ ప్యారడైజ్ (శ్రీ సంపత్ నగర్)లో 998 చదరపు గజాల పార్కును అక్రమంగా ఆక్రమించారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగ్గని స్థానికుల ఫిర్యాదు ప్రకారం పార్క్ స్థలని ఆక్రమించారని నిర్ధరించుకున్న తర్వతే  చర్య తీసుకుంది. పార్క్ భూమిలో నిర్మించిన కంచె, షెడ్‌ను హైడ్రా సిబ్బంది తొలగించారు. అలాగే ఊట్‌పల్లి గ్రామంలోని కెప్టెన్-2 కాలనీలో 33 అడుగుల రోడ్డును ఆక్రమించి గోడ నిర్మించినట్లు మరొక ఫిర్యాదు అందింది. దర్యాప్తు అనంతరం హైడ్రా ఆక్రమణ గోడను కూల్చివేసింది. రెండు కూల్చివేతలను సోమవారం నిర్వహించారు.