మేడిపల్లి, జనవరి 25 (విజయక్రాంతి): పోచారం మున్సిపాలిటీ పరిధిలో శనివారం హైడ్రా అధికారులు కొరడా ఝులిపించారు. మున్సిపాలిటీ పరిధిలోని దివ్యనగర్ నందు నల్లమల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత నల్ల మల్లారెడ్డి అక్రమంగా నిర్మించిన ప్రహరీని కూల్చివేశారు. ఈ ప్రహరీ అక్రమంగా నిర్మించడం వలన తమ కాలనీకి దారి లేకుండా పోయిందని సింగరేణియన్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఇటీవల హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుకు స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవలక్షేత్రస్థాయిలో పర్యటించి విచారణ చేపట్టారు. కాగా శనివారం ఉదయం అక్రమంగా నిర్మించిన ప్రహరీని పోలీస్ బందోబస్త్ నడుమ హైడ్రా అధికారులు కూల్చివేశారు.