28-03-2025 12:25:27 AM
మాజీ కార్పొరేటర్ ఆక్రమించి నిర్మించిన అక్రమ రూములు, షెడ్స్ నేలమట్టం
కుత్బుల్లాపూర్, మార్చ్ 27(విజయ క్రాంతి):కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ సర్వే నెంబర్ 191 లో వెలసిన అక్రమ నిర్మాణాలను గురువారం హైడ్రా అధికారులు కూల్చివేశారు.బీఆర్‌ఎస్ కు చెందిన ఓ మాజీ కార్పొరేటర్ ప్రభుత్వ భూమిని 59 జీవో ద్వారా రెగ్యులరైజ్ చేసుకుని అందులో ఇళ్లు నిర్మించుకున్నాడు.
అయితే 59 జీవో ద్వారా రెగ్యులరైజ్ చేసుకున్న స్థలంతో సుమారు మరో వెయ్యి గజాల ప్రభుత్వ స్థలం కబ్జా చేసి రూములు, షెడ్స్ నిర్మించాడు. మాజీ కార్పొరేటర్ చేసిన అక్రమ నిర్మాణాలపై పలు పత్రిక కథనాలతో పాటు, హైడ్రా కు పలువురు ఫిర్యాదులు చేశారు. గురువారం హైడ్రా అధికారులు పోలీస్ ప్రొటెక్షన్ తో వచ్చి మాజీ కార్పొరేటర్ నిర్మించిన అక్రమ షెడ్స్,రూములను నేలమట్టం చేశారు.