హైదరాబాద్,(విజయక్రాంతి): మణికొండలోని నెక్నాంపూర్ లో అక్రమ నిర్మాణాల(Illegal Structures)ను హైడ్రా అధికారులు శుక్రవారం కూల్చివేస్తున్నారు. నెక్నాంపూర్ చెరువు(Neknampur Pond)ను కొందరు కబ్జా చేసి భారీగా అక్రమ నిర్మాణాలు నిర్మించారు. అయితే కొందరు మంది స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath)కు చెరువును కబ్జా చేసి అక్రమంగా ఇండ్ల నిర్మాణం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన రంగనాథ్ చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించడంతో హైడ్రా సిబ్బంది భారీ పోలీస్ బందోబస్తు నడుమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.