అక్రమ కట్టడాల తొలగింపు
అబ్దుల్లాపూర్‌మెట్, ఫిబ్రవరి 9: రంగా రెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం లోని కొహెడ గ్రామంలో హైడ్రా ఆదివారం కూల్చివేతలు చేశారు. కొహెడ గ్రామ సర్వే నంబర్ 951, 952 లోని గ్రామపంచాయతీ లేఔట్ లో తమ ప్లాట్లను సమ్మిరెడ్డి బాల్రెడ్డి అనే వ్యక్తి ఆక్రమించి రహదారులు లేకుండా అడ్డుగోడలుగా ఫార్మ్ హౌజ్ కట్టాడానికి ప్రయత్నం చేస్తున్నాయని రాధే ధామం లే ఔట్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు పలువురు ప్లాట్ ఓన ర్లు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో హైడ్రా చర్యలు తీసుకుంది.
కోహెడ గ్రామంలోని సర్వే నెం.951, 952లోని 7.28గుంటలకు సంబధించిన డాక్యుమెంట్స్ పరిశీలించ గా1986లో భూ యజమానులు కె. రాము లు, పెద్దయ్య, ఈసయ్య గ్రామ పంచాయతీ లేఔట్ వేసినట్టు నిర్ధారణ చేశారు.ఆ భూమిని సంరెడ్డి బాల్రెడ్డి అనే వ్యక్తి స్వాధీ నం చేసుకుని, ఫాం హౌస్ నిర్మించడంతో పాటు..లే ఔట్లోని పలు ప్లాట్లను సొంతం చేసుకుని... దాని అంతర్గత రహదారులను బ్లాక్ చేసినట్టు తెలిపార.సంబంధిత అన్ని పత్రాలతో హాజరు కావాలని ఇరు పక్షాలకు హైడ్రా నోటీసులు జారీ చేసింది.
దీంతో ఈ నెల 8న ఇరు పక్షాలు హాజరు కాగా.. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో డాక్యుమెంట్స్ పరీలించిన హైడ్రా ఫామ్హౌస్, షెడ్, కాంపౌండ్ వాల్, ఫెన్సింగ్ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ అధికారులు తెలిపారు.లే ఔట్ వేసి తమకు ప్లాట్లుగా అమ్మిన తర్వాత సమ్మిరెడ్డి ఈ భూమిని కొన్నట్టు రికార్డులు సృష్టించారని ప్లాట్ ఓనర్ల అససియేషన్ ప్రతినిధుల ఆరోపించారు.
ఇరుపక్షాలతో పాటు రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో విచారించిన తర్వాత సమ్మిరెడ్డి బాల్రెడ్డి నిర్మించిన ఫాంహౌస్తోపాటు అక్కడ నిర్మించిన ప్రహరీ, ఫెన్సింగ్ హైడ్రా అధికారులు పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేశారు. ఇది ఇలా ఉండగా తమది ప్రయివేట్ ల్యాండ్ అని ఎక్కడ కూడా తాము ప్రభుత్వ భూమిని కానీ,కానీ పార్క్ స్థలన్నీ కానీ,చెరువు స్థలం,ఎఫ్టిల్,భఫర్ జోన్ జోలికి కూడా పోలేదని హైడ్రా కట్టడాలను నిబంధనలు ఉలంఘించి కూల్చివేసిందని సంరెడ్డి బాల్ రెడ్డి తెలిపారు.