calender_icon.png 5 January, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాజాగూడలో హైడ్రా కూల్చివేతలు

01-01-2025 01:45:46 AM

శేరిలింగంపల్లి, డిసెంబర్ 31: ఏడాది చివరిరోజున నగరవా సులందరూ సంబరాలకు సిద్ధమవు తున్న వేళ హైడ్రా మరోసారి కొరడా ఝులిపించింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఖాజా గూడ భగీరథమ్మ చెరువు బఫర్ జోన్‌లో వెలిసిన పలు నిర్మాణా లను మంగళవారం హైడ్రా అధికారులు కూల్చివేశారు. అలాగే బఫర్‌జోన్‌లోని నాలుగు ఎకరాల్లో వేసిన ఫెన్సింగ్‌నూ తొలగించారు. నోటీసులు ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే తమ వ్యాపార సముదాయాలను ఎలా కూల్చివే స్తారంటూ అధికారుల తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హడావుడిగా కూల్చివేతలు చేపట్టి తమను రోడ్డున పడేసారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.