హైదరాబాద్: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు(Hydra demolition) కొనసాగుతున్నాయి. అయ్యప్ప సొసైటీలో 100 ఫీట్ రోడ్డు వద్ద అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని డీఆర్‌ఎఫ్ (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) సిబ్బంది ఆదివారం బుల్‌డోజర్‌తో కూల్చివేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Greater Hyderabad Municipal Corporation) గత ఏడాది భవన యజమానులకు నోటీసులు జారీ చేయగా, ఆ తర్వాత హైకోర్టు(High Court) నిర్మాణం అక్రమమని ప్రకటించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్(HYDRA Commissioner AV Ranganath) శనివారం స్థలాన్ని పరిశీలించారు. మరుసటి రోజు కూల్చివేత ప్రారంభమైంది. భవనం ప్రధాన రహదారి పక్కన ఉన్నందున, విద్యుత్ సరఫరా నిలిపివేయబడింది. ఆపరేషన్ సమయంలో పోలీసులు ట్రాఫిక్ నిర్వహణను సజావుగా నిర్వహించారు.