calender_icon.png 19 April, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు

19-04-2025 12:30:04 PM

హైదరాబాద్: ఆక్రమణలపై కఠిన చర్యలు కొనసాగిస్తూ శనివారం మియాపూర్(Miyapur)లో హైడ్రా అధికారులు(HYDRA Officers) కూల్చివేతలు చేపడుతున్నారు. మియాపూర్ వరల్డ్ వన్ స్కూలు(Miyapur World One School) వెనుక ఉన్న భారీ షెడ్లను హైడ్రా అధికారులు నెలమట్టం చేశారు. పోలీసుల బందోబస్తు మధ్య జేసీబీలతో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అటు వనస్థలిపురంలో హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలు పెట్టారు. ఇంజాపూర్‌లో కూల్చివేతలు జరుగుతున్నాయి. అక్కడ అనేక కాలనీలను కలిపే ప్రధాన రహదారిని ఒక ఐస్ క్రీం కంపెనీ అక్రమంగా ఆక్రమించింది. నివాసితుల ఫిర్యాదుల మేరకు, హైడ్రా దర్యాప్తు నిర్వహించి, ఆ కంపెనీ చట్టవిరుద్ధంగా ప్రీకాస్ట్ నిర్మాణాలను నిర్మించిందని నిర్ధారించింది. ఆక్రమణలను తొలగించడానికి ప్రస్తుతం కూల్చివేత ప్రక్రియ జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. వనస్థలిపురం ఇంజాపూర్ వాసులు హైడ్రాకు జిందాబాద్ కొట్టారు.