calender_icon.png 14 February, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతి రిసార్ట్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా

14-02-2025 12:56:24 AM

  1. నిర్మాణదారులకు హైకోర్టులో చుక్కెదురు 
  2. 30 రోజుల గడువు ముగియడంతో కూల్చివేత 

మేడ్చల్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా దేవరయంజల్ గ్రామంలోని కోమటికుంటలో ప్రకృతి రిసార్ట్స్ అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు గురువారం కూల్చేశారు. కోమటి  ఎఫ్‌టీఎల్ పరిధిలో ప్రకృతి రిసార్ట్స్ వారు అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికులు గతంలో ఫిర్యాదు చేశారు.

దీంతో హైడ్రా అధికారులు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తిస్థాయి విచారణ చేశారు. ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ హాల్‌కు ఎలాంటి అనుమతులు లేవని విచారణలో వెల్లడైంది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే నిర్మాణాలు జరగడంతో నిర్మాణదారులకు హైడ్రా నోటీసులు అందించింది.

దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులోను వారికి చుక్కెదురైంది.  అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. తామే తొలగిస్తామని, 30 రోజుల సమయం కావాలని కోరారు. గడువు ముగిసినా తొలగించకపోవడంతో హైడ్రా రంగంలోకి దిగింది.

53 హోర్డింగులు తొలగింపు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): నగర శివారు ప్రాంతంలో అనుమతి లేకుండా వెలిసిన 53 హోర్డిం గ్ లను తొలగించినట్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.  ఓఆర్‌ఆర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు నగర శివారు మున్సిపాలిటీల్లో అనుమతిలేని హోర్డింగ్ ల ను గత శుక్రవారం నుంచి గురువారం దాకా వారం రోజులలో మొత్తం 53  హోర్డింగ్స్ తొలగించినట్టు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా హోర్డింగ్స్ ఏర్పాటు చేయొద్దని సూచించారు.