21-02-2025 12:37:15 AM
కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 20: కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జగద్గిరిగుట్ట భూదేవి హిల్స్‌లో గురువారం హైడ్రా కొరడా ఝుళిపించింది. గాజులరా మారం పరికి చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో వెలసిన నిర్మాణాలను కూల్చివేసింది. పోలీసుల భద్రత మధ్య కూల్చివేతలు చేపడుతున్నారు. ఉదయం మొదలయిన కూల్చివేతలు సాయంత్రం వరకూ కొనసాగాయి.
రెండు భవంతులను, మూడు బేస్మెంట్లను తొలగించారు. ఇప్పటికే నివాసం ఉంటు న్న ఇళ్ల జోలికి వెళ్లకుండా నిర్మాణ దశలో ఉన్న వాటినే తొలగించారు. 50 గజాల స్థలాన్ని రూ.15 లక్షలకు కొన్నామని, ఇది ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తుందని తమకు తెలియదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.