calender_icon.png 21 January, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాప్రాల్‌లో ఆక్రమణలను కూల్చివేసిన హైడ్రా

07-12-2024 02:32:39 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (విజయక్రాంతి): జవహర్‌నగర్ యాప్రాల్‌లోని నాగిరెడ్డికుంట నాలాకు ఆనుకుని బఫర్ జోన్‌లో నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు శుక్రవారం కూల్చివేశారు. సర్వే నంబర్ 14, 32 లోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన డీఎన్‌ఆర్ ఫంక్షన్‌హాల్.. అక్రమ నిర్మాణమని అధికారుల విచారణలో నిర్దారణ కావడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ప్రభుత్వ స్థలంలోకి వచ్చిన ఫంక్షన్‌హాల్ ప్రహరీని సిబ్బంది కూల్చివేశారు.

జీహెచ్‌ఎంసీ యాక్ట్ 405 ప్రకారం నాగిరెడ్డికుంట నాలాకు ఆనుకొని ఉన్న భూమిలో నిర్మించిన వాటిని కూల్చివేసినట్టు తెలిపారు. కోర్టు స్టే ఆర్డర్ ఉన్న సర్వే నంబరు 25లో కూల్చివేతలు చేపట్టలేదని అధికారులు స్పష్టం చేశారు. అలాగే  సర్వే నంబరు 32లో ధోబీఘాట్‌ను కబ్జా చేసి నిర్మించిన ప్రహరీని కూడా హైడ్రా కూల్చివేసింది.