హైదరాబాద్: దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటలోని లక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్ విల్లాల్లోని అనధికార నిర్మాణాల కూల్చివేతను హైడ్రా ఆదివారం చేపట్టింది. మల్లంపేట (కత్వ) సరస్సులోని ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్) ప్రాంతంలో విల్లాలు నిర్మించినట్లు గతంలో హైడ్రా అధికారులు గుర్తించారు. శ్రీలక్ష్మిశ్రీనివాస కన్‌స్ట్రక్షన్ విల్లాల కూల్చివేతలకు హైడ్రా నిర్ణయం తీసుకుంది. భారీ పోలీసు భద్రతతో కట్టుదిట్టమైన భద్రత నడుమ కూల్చివేతలు చేపడుతున్నారు.
మాదాపూర్ ఏరియాలో మాదాపూర్ లోని సున్నం చెరువు సరస్సు పరిసర ప్రాంతాల్లోనూ అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఈ సరస్సు 26 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అధికారులు దాని ఎఫ్ టీఎల్, బఫర్ జోన్‌లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన షెడ్‌లు, భవనాలను కూల్చివేశారు. అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేస్తుండగా ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. అటు సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీలో హెచ్‌ఎంటీ కాలనీ, వాణినగర్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు.