calender_icon.png 20 October, 2024 | 2:02 PM

అక్రమార్కులపై హైడ్రా అంకుశం

20-10-2024 01:57:20 AM

  1. ఫామ్‌హౌస్‌ల కోసమే కేటీఆర్, హరీశ్ నాటకాలు
  2. బుల్డోజర్లకు అడ్డుపడితే.. బిడ్డా తొక్కుకుంటూ పోతాం
  3. హైదరాబాద్‌ను కాపాడేందుకే హైడ్రా ఏర్పాటు
  4. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
  5. గీతారెడ్డికి రాజీవ్ సద్భావన అవార్డు ప్రదానం

చార్మినార్, అక్టోబర్ 19(విజయక్రాంతి): ప్రకృతి విపత్తుల నుంచి హైద రాబాద్ నగరాన్ని కాపాడేందుకు ఏర్పాటుచేసిన హైడ్రాను రాష్ట్రంలోని ౯౦ శాతం ప్రజలు స్వాగతిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అక్రమా ర్కులకు హైడ్రా భూతంలా మారిందని తెలిపారు.

చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములు కబ్జాచేసి పెద్దపెద్ద భవనాలు, ఫామ్ హౌస్‌లు నిర్మించుకున్న వారి పట్ల హైడ్రా అంకుశంలా మారిందని అన్నారు. కొందరు హైడ్రాను అడ్డుకోవాలని, రియల్ వ్యాపారాన్ని దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలు పాటించే సంస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

అక్రమార్కులకు మాత్రం కంటిమీద కునుకు ఉండదని హెచ్చరించారు. శనివారం చార్మినార్ వద్ద ఏర్పాటుచేసిన రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర స్మారక దినోత్సవ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజ రై మాజీ మంత్రి గీతారెడ్డికి రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డును ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పేదల అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ‘హైడ్రా అనగానే బిల్లా, రంగా మాదిరిగా హ రీశ్‌రావు, కేటీఆర్ బయటకు వస్తారు. బావ బామ్మర్దులు ఇద్దరు బుల్డోజర్లకు అడ్డుపడు తాం అంటున్నారు. బుల్డోజర్లకు అడ్డు పడితే బిడ్డా.. తొక్కుకుంటూ వెళ్తాం.

అక్కడికి రా.. ఇక్కడికి రా చూసుకుందాం అంటున్నారు. ఎక్కడికో ఎందుకు.. జన్వాడ లేదా అజీజ్‌నగర్‌లోని మీ ఫామ్‌హౌస్‌ల వద్దకు పోదాం అని ఎందుకు అనటం లేదు? హరీశ్‌రావు.. నీలాంటి చెప్పులు మోసేవారు కాదు.. ఫా మ్‌హౌస్‌లో పడుకున్న వాళ్లను రమ్మను. నే నూ వస్తా. హరీశ్.. నువ్వు నా ఇంటి ముందు చేతులు కట్టుకొని నిలబడ్డ రోజులు మార్చిపోయావా?’ అని ప్రశ్నించారు.

ఫామ్‌హౌస్ లు కాపాడుకునేందుకు బిల్లా రంగాలు దొం గ ఏడుపులు ఏడుస్తున్నారని ఆగ్రహం వ్య క్తంచేశారు. ఫామ్‌హౌస్‌ల విషయంలో అఖిలపక్షంతో నిజనిర్ధారణ కమిటీ వేసి నిజాలు నిగ్గు తెలుద్దామని సవాల్ విసిరారు. మూసీనదిలో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేప ట్టలేదని తెలిపారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారంతోపాటు చెరువులు, కాలువలు, నాలాల ను పునరుద్ధరించి అభివృద్ధి చేసేందుకే హైడ్రాను ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. 

ఇందిరమ్మ కుటుంబంతోనే మేలు

దేశ సమగ్రత కోసం మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ సద్భావన యాత్రను చేపట్టారని సీఎం గుర్తుచేశారు. నాడు కొన్ని పార్టీలు ప్రజల మధ్య కులం, మతం పేరుతో చిచ్చుపెడితే దేశంలో ప్రశాంత వాతావరణం తీసు కురావడానికి రాజీవ్ సద్భావన యాత్ర ప్రారంభించారని గుర్తుచేశారు. ఏటా ఆయ న స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

రాజకీయల్లో, వైద్య రంగంలో సుదీర్ఘ కాలం ప్రజలకు సేవలందించిన మాజీ మంత్రి గీతారెడ్డికి రాజీవ్ సద్భావన అవార్డు ఇవ్వటం సరైన నిర్ణయమని పేర్కొన్నారు. దేశంలో ప్రజలకు మేలు జరిగింది ఒక్క ఇందిరమ్మ కుటుంబంతోనే అని స్పష్టంచేశారు.  ప్రధాని పదవిని కూడా సోనియాగాంధీ త్యాగం చేశారని గుర్తు చేశా రు.

దోపిడీ చరిత్ర కలిగిన కేసీఆర్ కుటుంబానికి..గాంధీ కుటుంబానికి పోలికే లేదని అ న్నారు.  కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు  మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్,  నేత లు హనుమంతరావు, మహ్మద్ షబ్బీర్ అలీ, ఫిరోజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.