calender_icon.png 8 January, 2025 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నందగిరిహిల్స్‌లో హైడ్రా కమిషనర్ పర్యటన

08-01-2025 12:44:30 AM

సర్వే అనంతరం కబ్జాలపై చర్యలుంటాయని వెల్లడి

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7(విజయక్రాంతి): జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్, హుడా ఎన్‌క్లేవ్, గురుబ్రహ్మనగర్ బస్తీల్లో మంగళవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఇక్కడి పార్కులు కబ్జా అవడంతో పాటు గురుబ్రహ్మనగర్ బస్తీలో డబుల్ బెడ్రూంల కోసం కేటాయించిన స్థలాన్ని పలువురు ఆక్రమిస్తున్నట్లు ఇటీవల హైడ్రా  ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ఫిర్యాదుల నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో పర్యటించిన రంగనాథ్ మాట్లాడుతూ.. సంబంధిత స్థలాల్లో డీజీపీస్ ద్వారా సర్వే చేపించి నిర్ధారించుకున్నాక విచారణ చేపడతామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా రంగనాథ్‌తో కలిసి ఆయా ప్రాంతాలను పరిశీలించారు.