హైదరాబాద్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ మున్సిపాలిటి పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం పర్యటించనున్నారు. అమీన్ పూర్ పై ప్రత్యేకంగా దృష్టి సారించిన హైడ్రా అక్కడ ఉన్న ప్రభుత్వ స్థలాలు, చెరువు భూముల్లో ఆక్రమణలను తొలగిస్తుంది. అమీన్ పూర్ నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో హైడ్రా కమిషనర్ పర్యటించి రహదారులు, ఎఫ్టీఎల్, బఫర్ జోలోని నిర్మాణాలను పరిశీలించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అనేక సార్లు అమీన్ పూర్ మున్సిపాలిటి పరిధిలో పర్యటించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.