మేడ్చల్: మేడ్చల్ జిల్లాలోని జగద్గిరిగుట్టలో హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) శనివారం పర్యటించారు. ఆలయ భూములు కబ్జా చేస్తున్నారన్న ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ పర్యటన కొనసాగింది. ఈ సందర్బంగా వేంకటేశ్వరస్వామి ఆలయ భూములను ఆయన పరిశీలించారు. ఆలయ భూములు కబ్జా అవుతున్నాట్లు ఫిర్యాదు మేరకు ఆయన కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారుల(Revenue Officers)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కబ్జా జరుగుతుంటే పట్టించుకొని అక్కడి అధికారులపై కమిషనర్ రంగానాథ్ మండిపడ్డారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవట్లేదని స్థానికులు కమిషనర్ కు తెలిపారు. దీంతో హైడ్రా కమిషనర్ కబ్జా చేసిన వ్యక్తులపై కేసులు పెట్టాలని పోలీసులకు ఆదేశించారు.