సంగారెడ్డి (విజయక్రాంతి): అమీన్పూర్ చెరువు పరిసరాలను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మంగళవారం సందర్శించారు. చెరువులోని నీరు తూముల ద్వారా వదలకపోవడంతో ఎగువున వున్న తమ నివాసాలు మునిగిపోతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఈ చెరువు పరిసరాలను హైడ్రా బృందం పరిశీలించింది. అమీన్పూర్ చెరువుకు సంబంధించిన సమగ్ర వివరాలను నిపుణుల కమిటీ వేసి నివేదిక తెప్పించుకుంటానని ఈ సందర్భంగా రంగనాథ్ తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.