calender_icon.png 21 March, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంగారం పెద్దచెరువును సందర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

20-03-2025 04:34:05 PM

శేరిలింగపల్లి (విజయక్రాంతి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ సర్కిల్ లోని గంగారం పెద్దచెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. పెద్దచెరువులో 5 ఎకరాలు కబ్జాకు గురైందంటూ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెరువును గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు చెరువు ఆక్రమణపై పూర్తి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చెరువుల ఆక్రమణలు చేస్తే ఎంతటీ వారైనా సహించేది లేదని అన్నారు. చెరువులను రక్షించుకోవడం మన అందరి బాధ్యత అని గుర్తుచేశారు. ప్రస్తుతం సిటీలో డ్రైనేజి, ట్రాఫిక్ సమస్యలకు ప్రధాన కారణం ఆక్రమణలు అని అన్నారు. చెరువులను ఆక్రమిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆక్రమణల గురించి ఎటువంటి సమాచారం ఉన్న భయపడకుండా హైడ్రకు ఫిర్యాదు చేయాలని స్థానికులను కోరారు.