calender_icon.png 1 March, 2025 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లచెరువును సందర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్...

28-02-2025 04:58:31 PM

కూకట్ పల్లి (విజయక్రాంతి): కూకట్ పల్లి లోని నల్లచెరువును శుక్రవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. చెరువు సుందరీకరణ పనుల్లో భాగంగా చెరువును పరిశీలించి చెరువు విస్తీర్ణంతో పాటు ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువులను కాపాడి వాటిని సుందరికరిస్తే ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతగానో ఆహ్లాదాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి, ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.