calender_icon.png 28 September, 2024 | 12:53 PM

కూకట్‌పల్లి సంఘటనతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు

28-09-2024 10:17:50 AM

హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్

హైదరాబాద్: కూకట్ పల్లి సంఘటనతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదనిహైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పేర్కొన్నారు. హైడ్రా ఎవరికీ ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని తెలిపారు. కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌తో మాట్లాడానని చెప్పిన రంగనాథ్ ఆమె కుమార్తెలు ఎఫ్‌టిఎల్‌కు దూరంగా కూకట్‌పల్లి సరస్సు సమీపంలోనే ఉంటున్నారని చెప్పారు.తమ ఇళ్లు (తల్లిదండ్రులు ఇచ్చినవి) కూల్చివేస్తారేమోనని కూతుళ్లకు భయం కలిగి, దాని గురించి తల్లిని ప్రశ్నించారు. కూతురి ప్రశ్నలకు తల్లి ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకుందని... ఈ ఎపిసోడ్‌తో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. హైడ్రా గురించి భయాందోళనలు సృష్టించడం మానేయాలని మీడియాను ముఖ్యంగా సోషల్ మీడియాను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అభ్యర్థించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కూల్చివేత హైడ్రాకు ఆపాదించబడుతోందన్నారు.

కూల్చివేత కోసం మూసీకి సంబంధించిన ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదన్నారు. మూసీ నదిలో రేపు భారీ కూల్చివేతలకు హైడ్రా ప్లాన్ చేస్తున్నట్లు అనేక తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. కొన్ని సోషల్ మీడియా ఛానెల్‌లు స్వార్థ ప్రయోజనాలే ఎజెండాగా హైడ్రాపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్ని మీడియాలను అభ్యర్థించండన్నారు. హైడ్రా లేదా దాని కూల్చివేతల గురించి సామాన్య ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది కూల్చివేత వల్ల పేద, దిగువ మధ్యతరగతి వ్యక్తి బాధపడకూడదని హైడ్రా కమిషనర్ సూచించారు.