హైదరాబాద్,(విజయక్రాంతి): చెరువుల పరిధిలోని ఇళ్లను కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. నిర్మాణాలు కూల్చి చెరువులు కాపాడటం హైడ్రా ఉద్దేశ్యం కాదని, చెరువుల పరిధిలో కొత్త నిర్మాణాలను అడ్డుకోవడం తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. అనధికారికంగా నిర్మించుకున్న ఇళ్లను కూల్చే ప్రసక్తే లేదని, చెరువులను కాపాడాలంటే ఇళ్లను కూల్చాల్సిన పనిలేదన్నారు. అమీన్ పూర్ తూములు మూయడంతో లేఔట్లు మునిగాయని, తప్పుడు అనుమతులు ఇచ్చిన ఇళ్లు కూల్చివేశామని హైడ్రా కమిషనర్ తెలిపారు. కొంతమందిపై చర్యలతో హైడ్రా పని అందరికీ తెలిసిందని, ప్రజల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై అవగాహన వస్తోందని చెప్పారు. అక్రమణల నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వాడుతున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొనియాడారు.