08-04-2025 02:32:57 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): సికింద్రాబాద్(Secunderabad)లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా మచ్చబొల్లారం హిందూ శ్మశానవాటికలో అక్రమంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసి భవన నిర్మాణాలు పరిశీలించారు. శ్మశానవాటికలో అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలపై స్థానికులు హైడ్రా కమిషన్ కు చేసిన ఫిర్యాదు మేరకు రంగనాథ్ శ్మశానవాటికను సందర్శించి అక్కడ నిర్మాణాలు చేపట్టవద్దని అల్వాల్ డిప్యూటీ కమిషనర్ కు సూచించారు. మచ్చబొల్లారం హిందూ శ్మశానవాటికను రక్షించాలంటూ స్థానికులు 24 రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు.