calender_icon.png 24 December, 2024 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువుల ఆక్రమణలపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం

24-12-2024 02:16:05 AM

సంబంధిత శాఖలతో పూర్తిస్థాయి విచారణకు ఆదేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (విజయక్రాంతి): నానక్‌రాంగూడకు చేరువలో ఉన్న తౌతానికుంట, భగీరథమ్మ చెరువు, నార్సింగ్‌లోని నెక్నాంపూర్ చెరువుల ఆక్రమణలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఆర్‌ఆర్‌కు చేరువలోని పలు చెరువులను ఆయన సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత శాఖలతో పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. చెరువుల ఆక్రమణలపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు.

తౌతాని కుంట, భగీరథమ్మ చెరువుల ఆక్రమణలతో పాటు.. ఆయా చెరువుల్లోకి వరద నీరు చేరకుండా కాలువలను మళ్లించడం, మూసివేయడంపై పట్ల రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్‌ఎంసీ, హెఎండీఏ అధికారులతో క్షుణ్నంగా పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాలని హైడ్రా అధికారులను ఆదేశిం చారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్ధూ యూనివర్సిటీ ఖాళీస్థలంలో వర్షపు నీరు వెళ్లే దారులు మూసుకుపోవడంతో తమ అపార్ట్‌మెంట్‌లోకి వరద నీరు వచ్చి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఫిర్యాదు చేశారు.

నానాక్‌రామ్‌గూడ ప్రధాన రహదారికి ఎగువున ఉన్న తౌతాని కుంట చెరువు నీరు.. దిగువవైపు ఉన్న భగీరథమ్మ చెరువుకు వెళ్లే కాలువ లింకు తెగిందని వివరించారు. నానక్‌రాంగూడకు ఇరువైపులా వరదనీటి కాలువలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు.

బఫర్ జోన్‌లో మట్టిపొసే చర్యలు 

బఫర్ జోన్‌లో మట్టిపొసే సంస్థలపై చర్యలుంటాయని రంగనాథ్ హెచ్చరించా రు. నార్సింగి దగ్గర మూసీ పరీవాహక ప్రాంతాన్ని కమిషనర్ రంగనాథ్  పరిశీలించారు. కొన్ని నిర్మాణ సంస్థలు మూ సీనదిలో పోసిన మట్టిని తొలగించాలని ఆదేశించారు. గ్రామీణ మ్యాప్‌లతో పాటు.. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా, తెలంగాణ విభాగాలకు చెందిన మ్యాప్‌లతో పూర్తి స్థాయి పరిశీలన జరిపించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశించారు.