calender_icon.png 31 October, 2024 | 4:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులపై హైడ్రా పంజా

01-09-2024 01:23:51 AM

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలకు.. 

అనుమతులిచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు

ఆరుగురిపై కేసులు నమోదు చేసిన ఈఓడబ్ల్యూ

మరో 50 మంది అధికారులపై చర్యలకు సిద్ధం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (విజయక్రాంతి): అక్రమ నిర్మాణాలతోపాటు వాటికి అనుమతిచ్చిన అధికారులపై హైడ్రా పంజా విసురుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదుతో చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో భవనాల నిర్మాణానికి అనుమతిచ్చిన ఆరుగురు ప్రభుత్వ అధికారులపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూ (ఆర్థిక నేర విభాగం)లో కేసులు నమోదయ్యాయి.

నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుదాంష్, బాచుపల్లి ఎమ్మార్వో పూల్ సింగ్, మేడ్చల్ మల్కాజిగిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాసులు, హెచ్‌ఎండీఏ సిటీ ప్లానర్ రాజ్‌కుమార్, హెచ్‌ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి సుదీర్‌కుమార్‌పై కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఇప్పటివరకు చెరువుల్లో నిర్మాణాల కు అనుమతిచ్చిన ౫౦ మంది అధికారులను హైడ్రా గుర్తించినట్లు తెలుస్తోంది. జాబితా కూడా రెడీ అయిందని సమాచారం. తాజా గా కేసులు నమోదైనవారిలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏకు చెందిన అధికారులు ఉండటంతో మిగతా అవినీతి అధికారుల గుండె ల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 

నిర్మాణదారులపై కేసులు నమోదు

మదీనాగూడ ఈర్ల చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు చేపట్టిన వారిపై పోలీ సులు కేసులు నమోదుచేశారు. చెరువు ఎఫ్‌టీఎల్ కొందరు నిర్మాణాలు చేపట్ట గా ఇటీవల హైడ్రా అధికారులు కూల్చివేశారు. నిర్మాణ అనుమతులు జారీచేసిన అధికారులపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయగా, నిర్మాణదారుల పై ఇరిగేషన్ అధికారి పావని ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. నిర్మాణదారులైన స్వర్ణలత, కిషోర్‌పై బీఎన్‌ఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసులు పెట్టారు.