- గూడు కోల్పోయి రోడ్డున పడ్డ బడుగులు
- గరీబోళ్లకో న్యాయం.. సీఎం అన్నకో న్యాయమా?
- ‘పేదవాళ్ల ఇళ్లను కూలిస్తే ఊరుకోం
- దమ్ముంటే అనుమతులిచ్చిన వారిపై చర్యలు తీసుకోండి
- బీఆర్‌నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో ఇండ్లు కూల్చివేసి పేదల బతుకులను రోడ్డు పాలు చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపణలు చేశా రు.
రేవంత్ రెడ్డి కుటుంబం రాష్ట్రాన్ని పంచుకొని స్వురై విహారం చేస్తూ దోచుకుంటున్నా రని ధ్వజమెత్తారు. మాదాపూర్‌లో రేవంత్ అన్న తిరుపతిరెడ్డి కమీషన్ల దుకాణం తెరిచారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే చెప్పినట్టు కేటీ ఆర్ ఆరోపించారు. శేరిలింగంపల్లిలో ఉప ఎన్నిక ఖాయమని, ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పక్కాగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మంగళవారం తెలంగాణ భవన్‌లో శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నగరంలో పేదల పట్ల ఒక న్యాయం, సీఎం రేవంత్ అన్న తిరుపతిరెడ్డి పట్ల ఒకలా హెడ్రా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ భారీ మెజార్టీలతో క్లీన్ స్వీప్ చేయడం తో కాంగ్రెస్‌కు ఓటు వేయలేదని ఆటో డ్రైవ ర్లు, బస్తీ వాసులు, పేదలపై రేవంత్‌రెడ్డి పగ తీర్చుకుంటున్నారని ఆరోపించారు. గరీబో ళ్లు పుస్తకాలు, సామాన్లు తీసుకుంటామంటే కూడా వారికి సమయం ఇవ్వటం లేదని, భవనాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తూ పేదలను రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం రేవంత్ మాత్రం 9 నెలల్లో బెదిరింపు లు, కూలగొట్టుడు, బ్లాక్ మెయిలు చేస్తున్నాడని మండిపడ్డారు. సినీ నటుడు నాగార్జున కు సంబంధించిన నిర్మాణం కూల్చడం మం చిదే కాని పర్మిషన్ ఇచ్చిన వారిఐ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలకు అసలు అనుమతులు ఇచ్చివారిని పేర్లు బయటపెట్టాలని నిలదీశారు.
నిర్మాణాలకు కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన అనుమతులేనని, నాగార్జునకు నోటీసులు ఇస్తే వాళ్లు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే మాజీ మం త్రి పట్నం మహేందర్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లు నేలమట్టం చేయాలని సవాల్ విసిరారు.
ఆ ఎమ్మెల్యే బతుకు బస్టాండే..
సీఎం రేవంత్‌రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేల ను ఇంటింటికి తిరిగి చేర్చుకున్నాడని, ఇప్పు డు వాళ్ల బతుకు జూబ్లీ బస్టాండ్ అయ్యిందని కేటీఆర్ అన్నారు. మొన్నటి హైకోర్టు తీర్పుతో వాళ్ల గుండెల్లో వణుకు మొదలైందని, అందుకే నీతి బాహ్యామైన పనులు చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ము, ధైర్యం ఉంటే తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని చెప్పాలని, మంచి పనులు చేస్తే ఉప ఎన్నికలు పెట్టి గెలువాలని సవాల్ చేశారు.
ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని.. అవ్వ, తాతలకు ౪ వేల ఫించన్ ఇస్తామని, ఉన్న రెండు వేలు కూడా ఇవ్వట్లేదని ఆరోపించారు. గెలిచిన మరుసటి రోజే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని, రూ. 49 వేల కోట్ల రుణమాఫీని రూ.12 వేల కోట్లతో సరిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రైతులు తమకు రుణమాఫీ కాలేదంటూ పొలాల్లో సెల్ఫీలతో నిరసన చెప్తున్నారని పేర్కొన్నారు. అసలు సీఎం కుర్చీకే భరోసాలేని పరిస్థితి ఉందని, ఖమ్మం బాంబా.. నల్లగొండ బాంబో అర్థం కాక భయంతో ఉన్నాడని ఎద్దేవాచేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని గొప్ప మాట లు చెప్తున్నారని సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఫ్లు ఓవర్లు ఎక్కడ చూసిన కేసీఆర్ ఆనవాళ్లే కనిపిస్తాయని స్పష్టంచేశారు.
తెలంగాణ ఉన్న న్ని రోజులు కేసీఆర్ కనిపిస్తూనే ఉంటాడు చిట్టినాయుడు అంటూ చురకలు అంటించారు. చిట్టి నాయుడు అన్నదమ్ముళ్లు ఏడుగురు తెలంగాణను పంచుకున్నారని, చిట్టి నాయుడు బృందం తెలంగాణలో స్వురై విహారం చేస్తూ దోచుకుంటున్నారని విరుచుకుపడ్డారు. సీఎం బంధువుల దౌర్జన్యాలతో రియల్‌ఎస్టేట్ ఢమాల్ అయిందన్నారు.
పేదలకు ఎవరూ లేరని దౌర్జన్యం
పేదలకు ఎవరూ అండగా లేరనే వారిపై హైడ్రా పేరుతో దౌర్జన్యం చేస్తున్నారని కేటీఆర్ ప్రభుత్వ తీరుపై విరు చుకుపడ్డారు. పేదవాళ్లే దిక్కులేక ఎక్కడైనా నాలాలపై ఇళ్లు కట్టుకుంటారని, మానవత్వం ఉన్న ప్రభుత్వమైతే వాళ్లకు నోటీసులు ఇవ్వాలని సూచించారు. లేదంటే వాళ్లకు వేరే ఇళ్లు కట్టించాలని హితవు పలికారు.
ఈ ప్రభుత్వానికి నీతి లేదని, తమ హయాంలో కట్టించిన 40 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పేదలకు పంపిణీ చేయాలని సూచించారు. హైడ్రాకు చుట్టం లేకపోతే అనుముల తిరుపతిరెడ్డిని ఎందుకు వదిలిపెడుతున్నారని, పేదలకు అండగా ఉండేందుకు త్వరలోనే హైదరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో మీటింగ్ నిర్వహించి, తమ అధి నేత కేసీఆర్ అనుమతితో కార్యక్రమాలు చేపడుతామని ప్రకటించారు.
తమ కన్నా ఎక్కువ పనులు చేసి ప్రజలకు మంచి చేయాలని, లేదంటే తాము ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నా సరే శేరిలింగంపల్లి కార్య కర్తల్లో ఎంతో కసి కనిపిస్తోందని చెప్పా రు. శేరిలింగంపల్లిలో బరాబర్ ఉప ఎన్నిక వస్తుందని.. అప్పుడు వాళ్లకు బుద్ధిచెప్పాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు.
మంత్రి శ్రీధర్‌బాబు అతి తెలివితో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారని, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేకు కండువా కప్పిన సన్నాసి, దౌర్భాగ్యుడు, వెధవ ఎవరో శ్రీధర్‌బాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మనం మనోడు కాదంటున్నాం.. వాళ్లు మనోడు కాదంటున్నారని వాళ్ల బతుకు ఎటు కాకుండా పోయిందని ఎద్దేవా చేశారు.
శేరిలింగంపల్లిలో ఉప ఎన్నిక ఖాయం, గెలుపు మానదే
శేరిలింగంపల్లిలో ఉప ఎన్నిక వస్తుంద ని.. మీ దాంట్లోంచే కొత్తగా ఒక ఎమ్మెల్యే వస్తాడని, మీకు ఏ బాధ వచ్చినా సరే ఒక్క ఫోన్ కాల్ వస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. కొత్తగా కమిటీలు వేసుకుందామని, పార్టీ మారిన వాళ్లు బాధపడుతూ మళ్లీ వస్తామని చెప్తున్నారని తెలిపారు. కేసీఆర్ యాదికి వస్తున్నాడని ఒక ముస్లిం సోదరుడు మాట్లాడుతున్నాడని గుర్తుచేశారు.
జేసీబీ వచ్చి ఇళ్లు కొట్టేస్తుంటే కేసీఆ ర్ నువ్వు రావాలని మరొక సోదరుడు అంటున్నాడని అన్నారు. మళ్లీ తెలంగాణలో కేసీఆర్ కావాలని కోరుకుంటు న్నట్టు పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ గెలవటం ఖాయమని, పదేళ్లు ఒక్క మత కల్లోలం లేకుండా పేదలను కడుపులో పెట్టుకొని చూసుకున్నామని స్పష్టంచేశా రు. బీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, చిట్టి నాయుడు ద్వారా మా త్రం అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు.