calender_icon.png 16 January, 2025 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాదీ చాక్లెట్‌కు విశ్వ గుర్తింపు

27-07-2024 05:02:47 AM

  1. టైమ్ మ్యాగజైన్ 100 గొప్ప ప్రదేశాలకు చోటు 
  2. జాబితాలో హైదరాబాద్‌కు చెందిన చాక్లెట్ తయారీ సంస్థ

న్యూఢిల్లీ, జూలై 26 : ప్రతిష్ఠాత్మక టైమ్ మ్యాగజైన్ ఏడాదికి సంబంధించి ‘ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల జాబితా’ను ప్రచురించింది. ప్రపంచంలో ప్రత్యేకంగా నిలిచే 100 అసాధారణ సంస్థలను ఇందులో పొందుపర్చింది. హోటళ్లు, క్రూజ్‌లు, రెస్టారెంట్లు, పర్యాటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్‌ల నుంచి టైమ్ యాజమాన్యం తొలుత నామినేషన్లు స్వీకరించింది. అనంతరం టైమ్ ప్రతినిధులు సందర్శించి వివరాలు ధ్రువీకరించుకున్నారు. కస్టమర్లకు సరికొత్త, ప్రత్యేక అనుభూతుల్ని పంచుతున్న వాటిని ఎంపిక చేసి టైమ్ తన జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో రెండు భారతీయ ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయి. హైదరాబాద్‌లోని మనం చాక్లెట్, హిమాచల్ ప్రదేశ్‌లోని నార్ రెస్టారెంట్లు ఈ ఘనత సాధించాయి.  

హైదరాబాద్ చాక్లెట్ తయారీ కంపెనీ 

భారత్‌లో పండించిన కోకోతో చాక్లెట్ల తయారీకి మనం చాక్లెట్ ప్రసిద్ధి పొందింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న ఈ సంస్థ ఉత్పత్తులకు ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. 2023 ఆగస్టులో మనం చాక్లెట్ కార్ఖానాను ముప్పల చైతన్య స్థాపించారు. అలాగే, హిమాచల్ ప్రదేశ్‌లో హిమాలయాల అంచున ఉన్న ఓ చిన్న గ్రామంలోని నార్ రెస్టారెంట్ కూడా జాబితాలో చోటు దక్కించుకుంది. కశ్మీర్‌కు చెందిన చెఫ్ ప్రతీక్ సాధు దీన్ని స్థాపించారు.  హిమాలయాల్లో దొరికే ఉత్పత్తుల రుచులను అందించాలన్న లక్ష్యంతో దీన్ని నెలకొల్పారు.