calender_icon.png 20 January, 2025 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై దుండగుల కాల్పులు

20-01-2025 10:40:24 AM

కాల్పులలో యువకుడు మృతి

ఎల్బీనగర్: అమెరికాలో దుండగుల కాల్పులలో చైతన్యపురి పరిధి లోని ఆర్కే పురం గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్- 2లో నివాసం ఉంటున్న కొయ్యడ చంద్రమౌళి  కుమారుడు రవితేజ అనే యువకుడు మృతి చెందాడు. 2022 మార్చిలో అమెరికా వెళ్లిన రవితేజ మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణ లో ఉన్నాడు. అమెరికా వాషింగ్టన్ ఏవ్ లో దుండగులు జరిపిన కాల్పులలో మృతి చెందగా..  హైదరాబాద్  ఆర్కేపురం అతని నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉన్నది.