- గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో దుర్మరణం
- కొడుకు మరణవార్త విని తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
- మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని వినతి
- మృతుడి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం
ఎల్బీనగర్, జనవరి 20: అమెరికాలో గన్‌కల్చర్‌కు హైదరాబాద్‌కు చెందిన యువ బలయ్యాడు. కారు డ్రైవర్‌గా పనిచే ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించి.. అమెరికాకు పంపిస్తే చేతికి అంది కొడుకు పరాయి దేశంలో జరిగిన కాల్పుల్లో మృతి చెందాడన్న వార్త విని ఆ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.
మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు... యాదాద్రి భువనగిరి జిల్లా చౌటు మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన కొయ్యాడ చంద్రమౌలి, శివమ్మ దంపతులకు కుమారుడు రవితేజ(24), కూతురు ప్రీతి ఉన్నారు. పిల్లల చదువుల కోసం నగరంలోని చైతన్యపురిలో18 ఏండ్ల క్రితం వలసవచ్చాడు చంద్రమౌలి.
క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూనే తన ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించాడు. కొడుకు రవితేజ, కూతురు ప్రీతి ఇద్దరూ ఇంజినీరింగ్‌పూర్తిచేశారు. రవితేజ 2022లో మాస్టర్స్(ఎంఎస్) చేయడానికి అమెరికాలోని వాషింగ్టన్‌కు వెళ్లాడు. ఇటీవలే కూతురు కూడా ఎంఎస్ చదవడానికి అమెరికాలోని చికాగోకు వెళ్లింది. కాగా రవితేజ ఇటీవలనే ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నాడు.
ఈ క్రమంలో ఆదివారం అమెరికాలోని వాషింగ్టన్‌లో గుర్తు వ్యక్తి జరిపిన కాల్పుల్లో రవితేజ అక్కడికక్కడే మృతి చెందాడు. తోటి స్నేహితులు హైదరాబాద్‌లో ఉంటున్న రవితేజ తల్లిదండ్రులకు ఫోన్‌లో విషయం చెప్పారు. కొడుకు మరణ వార్త తెలుసుకున్న తండ్రి ఒక్కసారిగా కుప్పకూలాడు.
స్వదేశానికి తెప్పించాలి: ఎమ్మెల్యే
రవితేజ మరణ వార్త తెలుసుకున్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి వెంటనే ఆర్కేపు అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రవితేజ మృతదేహాన్ని స్వదేశా తీసుకరావడానికి ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పరంగా బాధితులకు ఆర్థిక సాయం అందించాలని ఎమ్మెల్యే కోరారు.