భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో హైదరాబాద్ తుఫాన్స్, బెంగాల్ టైగర్స్ ఫైనల్లో అడుగపెట్టాయి. రూర్కెలా వేదికగా శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో బెంగాల్ టైగర్స్ 6 తమిళనాడు డ్రాగన్స్‌పై షూటౌట్‌లో విజయం సాధించింది.
నిర్ణీత సమయం లోగా ఇరుజట్లు 2 సమంగా నిలిచాయి. బెంగాల్ తరఫున ప్రదీప్ (30వ ని.లో), సామ్ లానే (53వ ని.లో) గోల్స్ చేయగా.. నాథన్ (18వ ని.లో), సెల్వమ్ (32వ ని.లో) గోల్స్ సాధించారు.
మరో సెమీస్‌లో హైదరాబాద్ తుఫాన్స్ 3 సుర్మా హాకీ క్లబ్‌పై విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ తరఫున అమన్‌దీప్ (25వ ని.లో), జాకబ్ (35వ ని.లో), నీలకంఠ (43వ ని.లో) గోల్స్ సాధించగా.. జెరెమి (60వ ని.లో) సుర్మాకు ఏకైక గోల్ అందించాడు. ఆదివారం జరగనున్న ఫైనల్లో హైదరాబాద్, బెంగాల్ తలపడనున్నాయి