calender_icon.png 30 October, 2024 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ ఓటర్లు @ 46.22 లక్షలు

30-10-2024 12:19:40 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29 (విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలోని ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి మంగళవారం విడుదల చేశారు. తాజా లెక్కల ప్రకారం హైదరాబాద్ జిల్లాలో మొత్తం 46 లక్షల 22వేల 133 మంది ఓటర్లు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

2024 పార్లమెంట్ ఎన్నికల జాబితా కంటే ప్రస్తుతం 51,995 మంది ఓటర్లు పెరిగారు. 2024 ఫిబ్రవరి 8 నాటికి 45లక్షల 70వేల 138 మంది ఓటర్లు ఉండగా, అప్పట్నుంచి లక్షా 81వేల 879 మంది నూతనంగా ఓటుహక్కు పొందారు. వివరాలు సరిగాలేని లక్షా 29వేల 884 మంది పేర్లను జాబితా నుంచి తొలగించారు.

ప్రస్తుత ఓటరు జాబితా ప్రకారం మొత్తం 1,675 ప్రాంతాల్లో 3,984 పోలింగ్ కేంద్రాల పరిధిలో 46లక్షల 22వేల 133 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 23లక్షల 53వేల 124 మంది, మహిళలు 22లక్షల 68వేల 666 మంది, 343 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్టుగా ఇలంబర్తి వెల్లడించారు.