calender_icon.png 9 January, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ తుఫాన్స్ విజృంభణ

08-01-2025 11:12:43 PM

హాకీ ఇండియా లీగ్...

భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో హైదరాబాద్ తుఫాన్స్ తొలి విజయాన్ని అందుకుంది. బుధవారం రూర్కెలాలోని బిర్సా ముండా స్టేడియం వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 3 యూపీ రుద్రాస్‌పై గెలుపొందింది. తుఫాన్స్ తరఫున వల్లాస్ జచారి (ఆట 6వ ని.లో), రాజిందర్ సింగ్ (14వ ని.లో), లక్రా శిలానంద్ (32వ ని.లో) గోల్స్ సాధించారు. తొలి విజయంతో హైదరాబాద్ తుఫాన్స్ పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. మరో మ్యాచ్‌లో తమిళనాడు డ్రాగన్స్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. తమిళనాడు డ్రాగన్స్ 6 టీమ్ గొనాసికాపై థ్రిల్లింగ్ గెలుపు సాధించింది. తమిళనాడు తరఫున జాన్సెన్ (19వ, 33వ, 50వ ని.లో) హ్యాట్రిక్ గోల్స్‌తో మెరవగా.. సుదేవ్ అబరన్ (15వ ని.లో), నాథన్ (55వ ని.లో), సెల్వమ్ కార్తీ (59వ ని.లో) గోల్స్ సాధించగా.. టీమ్ గొనాసికా తరఫున అరైజీత్ సింగ్ (5వ, 7వ ని.లో), చందా నిక్కిన్ (39వ ని.లో), వాల్కర్ స్ట్రువన్ (43వ ని.లో), క్లిమెంట్ (58వ ని.లో) గోల్స్ అందించారు. ఈ విజయంతో తమిళనాడు డ్రాగన్స్ పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.