calender_icon.png 26 December, 2024 | 2:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హౌజింగ్ విక్రయాలలో టాప్‌లో హైదరబాద్

26-12-2024 02:04:53 AM

  • హెచ్‌ఎండీఏ అనుమతులకు 45 శాతం పెరిగిన దరఖాస్తుల సంఖ్య
  • జాయింట్ కమిషనర్ శ్రీవత్స కోట

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 25 (విజయక్రాంతి): హైదరాబాద్ మహాన గరంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పురోభివృద్ధి సాధిస్తోందని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ప్రథమార్థంలో రూ. 58,481 కోట్లతో హౌసింగ్ విక్రయాలలో హైదరాబాద్ ఐదేళ్ల గరిష్టాన్ని నమోదు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. హెచ్‌ఎండీఏ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్ శ్రీవత్స కోట, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అనంతరం వారు ఓ ప్రకటనల విడుదల చేశారు. ఎఫ్‌డీఐ పెట్టుబడులను ఆకర్షించడంతో రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధి పెరుగుతోందన్నారు. ఆఫీస్ స్పేస్‌లో ఆక్యుపెన్సీ పెరగడం, రెసిడెన్షియల్ సేల్స్‌లో కూడా పెరుగుదల ఉన్నట్టు వారు పేర్కొన్నారు. గతేడాది నవంబర్ నెలలో (2023)లో 1,740 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది (2024) 2,078 దరఖాస్తులు పెరిగాయి. గత ఏడాది 1,485 దరఖాస్తులను పరిష్కరించగా, ఈ ఏడాది 2,071 దరఖాస్తులు పరిష్కరించి నట్టు వివరించారు.

ఇది మొత్తం 40 శాతం వృద్ధి రేటును సూచిస్తున్నట్టు తెలిపారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 2023 జూలై నుంచి నవంబర్ కంటే ఈ ఏడాది 2024లో జూలై నుంచి నవంబర్ దాకా 45 శాతం అనుమతులకు దరఖాస్తుల సంఖ్య పెరిగినట్టు హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్లు, హెచ్‌సిటీ ప్రాజెక్టులో రూ.7,032 కోట్లతో 38 ప్రాజెక్టులు, సీఆర్‌ఎంపీ  కింద 1,143 కిలోమీటర్ల రోడ్లను రూ. 3,825 కోట్లతో 934 రోడ్లను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఎస్‌ఎన్‌డీపీ భాగంగా రూ. 667.28 కోట్లతో 40 పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఎన్‌డీఎంఎఫ్ కింద 41 పనులను రూ.291 కోట్లతో చేయనున్నట్టు తెలిపారు.