calender_icon.png 13 January, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో స్థానానికి హైదరాబాద్ తుఫాన్స్

13-01-2025 12:09:12 AM

కళింగ లాన్సర్స్‌పై విజయం

భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో హైదరాబాద్ తుఫాన్స్ వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. ఆదివారం రూర్కెలా వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వేదాంత కళింగ లాన్సర్స్‌పై ఘన విజయాన్ని అందుకుంది. తుఫాన్స్ తరఫున గొంజాలో (ఆట 6వ, 30వ నిమిషంలో), మైకో (21వ ని.లో), టిమ్ బ్రాండ్ (47వ ని.లో), అర్ష్‌దీప్ (54వ ని.లో) గోల్స్ సాధించారు. 

అలెగ్జాండర్ (5వ ని.లో) కళింగ లాన్సర్స్‌కు ఏకైక గోల్ అందించాడు. ఈ విజయంతో హైదరాబాద్ తుఫాన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకొచ్చింది. కళింగ లాన్సర్స్ ఆరో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌లో తమిళనాడుతో ఢిల్లీ తలపడనుంది.