calender_icon.png 25 October, 2024 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ టూ భద్రాచలం రివర్స్ స్కేటింగ్

25-10-2024 01:25:12 AM

 గిన్నిస్ బుక్ రికార్డుకు ఇద్దరు చిన్నారుల సాహసం

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 24(విజయక్రాంతి): లక్ష్యం ఉంటే ఎంత కష్టమైనా ఇష్టంతో చేస్తారనేది ఆచరణలో నిరూపించేందుకు ఇద్దరు చిన్నారులు పూనుకొన్నారు. హైదరాబాద్‌కు చెందిన రాజేశ్ కుమార్ (8వ తరగతి), ఉమేశ్ కుమార్ (7వ తరగతి) ఇద్దరూ అన్నదమ్ములు.

వీరు గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాలనే పట్టుదలతో పాటు, గర్ల్స్, చైల్డ్ ప్రొటెక్షన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి సుమారు 300 కిలోమీటర్ల మేరకు హైదరాబాద్ నుంచి భధ్రాచలం వరకు రివర్స్ స్కేటింగ్ చేసి ఔరా అన్పించారు. వీరిద్దరు గత మూడు సంవత్సరా లుగా స్కేటింగ్‌లో శిక్షణ పొందుతున్నారు.

గురువారం ఉదయం హైదరాబాద్ రామోజీ ఫిల్మీ సిటీ నుంచి రివర్స్ స్కేటింగ్ ప్రారంభించారు. ఇప్పటి వరకు ఇటువంటి సాహసం ఎవరూ చేయలేదు. భవిష్యత్తులో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరక స్కేటింగ్ చేయనున్నట్లు వారి తండ్రి కలకోట నవీన్ కుమార్ తెలిపారు.